జైపూర్/న్యూఢిల్లీ: రాజకీయ సంక్షోభం దిశగా సాగుతున్న రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సన్నిహితుల ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చర్చనీయాంశమయ్యాయి. సీఎం గహ్లోత్‌తో సన్నిహితంగా ఉండే రాజీవ్ అరోరా, ధర్మేంద్ర రాథోడ్ ఇళ్లల్లో ఐటీ అధికారులు సోమవారం ఉదయం సోదాలు నిర్వహించారు. మొత్తం 24 చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. జైపూర్, కోటా, ఢిల్లీ, ముంబైల్లో జరగుతున్న సోదాల్లో 200 మంది ఐటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇక రాజస్తాన్, ఢిల్లీల్లో నగల వ్యాపారం చేసే రాజీవ్ అరోరా పన్నుల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్నారు. పన్ను ఎగవేత కేసుల్లో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట డైరెక్ట్రరేట్ (ఈడీ) అధికారులు కూడా సోమవారం జైపూర్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ స్నేహితుడు రవికాంత్ శర్మ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే, ఐటీ తనిఖీలకు తమ సోదాలకు సంబంధం లేదని ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇదిలాఉండగా.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలపైనే అశోక్ గహ్లోత్ సన్నిహితుల నివాసాలపై ఇన్‌కం ట్యాక్స్, ఈడీ విభాగాలు ఈ మెరుపుదాడులకు దిగాలయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
(చదవండి: ‘109 మంది ఎమ్మెల్యేలు మా వెంటే’)
Comments
Please login to add a commentAdd a comment