'ఇది ఆత్మహత్య కాదు, హత్య' | It's not suicide. It's murder: kejriwal | Sakshi
Sakshi News home page

'ఇది ఆత్మహత్య కాదు, హత్య'

Published Tue, Jan 19 2016 11:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

'ఇది ఆత్మహత్య కాదు, హత్య'

'ఇది ఆత్మహత్య కాదు, హత్య'

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి టార్గెట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి వేముల రోహిత్ చక్రవర్తి ఆత్మహత్యపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులను పదవులను తప్పించాలని ట్విటర్ లో పేర్కొన్నారు.

'దళితులను ఉద్ధరిస్తామని మోదీ సర్కారు గొప్పలు చెబుతోంది. మోదీ మంత్రులేమో ఐదుగురు దళిత విద్యార్థుల నోరు నొక్కి, వారిని సస్పెన్షన్ కు కారణమయ్యారు. ఇది ఆత్మహత్య కాదు, హత్య. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కూనీ చేశార'ని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లేఖ కారణంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఆయనపై హైదరాబాద్ లో కేసు కూడా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement