కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి బడా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తోందన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపణలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. రైతులను నిర్లక్ష్యం చేస్తూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ రాయితీలు ఇస్తున్నారన్న రాహుల్ వ్యాఖ్యలను జైట్లీ తిప్పికొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలు రైతులను పట్టించుకోవడం లేదని రాహుల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని జైట్లీ అన్నారు.
పారిశ్రామికవేత్తల రుణాలను ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయలేదని, రాహుల్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని స్పష్టం చేశారు. బ్యాంకులకు బకాయిపడ్డ వారిపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన దివాలా చట్టం కింద తదుపరి చర్యలు చేపట్టం జరుగుతుందని చెప్పారు.
పారిశ్రామికవేత్తలు బకాయిలుపడ్డ రుణాలన్నీ యూపీఏ హయాంలో ఇచ్చినవేనని జైట్లీ గుర్తుచేశారు. భారీగా రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన ఇద్దరు డైమండ్ వ్యాపారులకు ప్రధాని రూ 35,000 కోట్ల రుణాలు ఇచ్చారని రాహుల్ చేసిన ఆరోపణలు అవాస్తవాలన్నారు. యూపీఏ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను ఎన్‌డీఏ హయాంలో వెలుగులోకి తెచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment