
న్యూఢిల్లీ: బారు గడ్డంతో చిరునవ్వు చిందిస్తున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా..? ఈయన ఒమర్ అబ్దుల్లా. జమ్మూ, కశ్మీర్ మాజీ సీఎం. ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో యువకుడిలా ఉండే ఒమర్ తాజా ఫొటో ఇది. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని కేంద్రం గతేడాది ఆగస్టులో తొలగించడం తెల్సిందే. అప్పట్నుంచి కశ్మీర్ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ ఉన్నారు. అప్పట్నుంచి గడ్డం తీయకపోవడంతో ఒమర్ ఇలా కొత్త వేషంలో కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.