శ్రీనగర్ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌పై కశ్మీర్‌లోని జమ్మూ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రోఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ తజూవుద్దీన్ అనే అధ్యాపకుడు భగత్‌సింగ్‌ను టెర్రరిస్ట్‌తో పోల్చారని వర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించి, యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తిని టెర్రరిస్ట్ అంటూ వ్యాఖ్యానించిన అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన వర్సిటీ వీసీ మనోజ్ కే ధర్.. ఘటనపై విచారణ చేయవల్సిందిగా ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఆదేశించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు తనకు రికార్డుతో కూడిన ఆధారాలను అందించారని, విచారణ పూర్తయ్యే వరకు తజూవుద్దీన్‌ను విధుల నుంచి బహిష్కరించినట్లు వీసీ తెలిపారు. విద్యార్థుల ఆరోపణలపై స్పందించిన ప్రోఫెసర్ తాను భగత్‌సింగ్‌పై అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తాను రష్యా విప్లవంలో లెనిన్ పాత్రపై విద్యార్థులతో రెండు గంటల పాటు మాట్లాడానని, దానిని కొందరు తప్పుగా వక్రీకరించారని తెలిపారు. భగత్‌సింగ్‌ను తాను ఎప్పుడూ విప్లవకారుడిగా, గొప్ప స్వాతంత్ర్యయోధుడిగా కీర్తిస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment