
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ (పాత ఫొటో)
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ భావోద్వేగానికి గురయ్యారు. ఏదో కార్యాలయాన్ని అధిరోహించడం కోసం తాను యత్నిస్తున్నట్లు కొందరు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఓ జాతీయ చానెల్‌తో చెప్పారు.
మరో రెండు నెలల్లో రిటైర్ అవుతాననగా ఇలాంటి వార్తలు రావడం బాధగా ఉందని అన్నారు. ఇలాంటి ఆరోపణలతో తాను రిటైరకావాలనుకోవడం లేదని చెప్పారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అధికారాలను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు తిరస్కరించారు. గత రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాల రీత్యా తాను ఈ పిల్‌ను విచారించలేనని జాస్తి పేర్కొన్నారు. తాను ఇచ్చిన తీర్పును 24 గంటల్లో మరోసారి మార్చబడకూడదని అనుకుంటున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment