సాక్షి సెంట్రల్ డెస్క్: ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. తమిళనాడులో ‘అమ్మ’ నేతృత్వంలోని ఏఐఏడీఎంకే విజయదుందుభి మోగిం చింది. తమిళనాడులో కరుణ చేతికే పగ్గాలు వస్తాయని సర్వేలు పేర్కొన్నాయి. జయకు 100 సీట్లలోపలే వస్తాయని రెండు సర్వేలు వెల్లడించాయి. టైమ్స్ నౌ-సీవోటర్ మాత్రం జయ 130-138 సీట్లు గెలుచుకుంటారని తెలిపింది. ఈ సర్వే చెప్పినట్లే జయ 134 స్థానాల్లో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా దీదీ గెలిచినా 160-170 స్థానాల్లో గెలుస్తారని ఎగ్జిట్‌పోల్స్ తెలిపాయి. కానీ దీదీ 211 సీట్లు గెలిచారు.
3 దశాబ్దాల పాటు బెంగాల్‌ను పాలించిన వామపక్ష కూటమి మూడోస్థానానికే పరిమితమైంది. కేరళలోనూ ఎల్డీఎఫ్ అంచనాలకు మించిన విజయాన్ని సొంతం (70 వస్తాయనుకుంటే 91 స్థానాల్లో గెలుపొందింది) చేసుకుంది. అయితే.. సర్వే అంచనాలకు అనుగుణంగా అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో డీఎంకే-కాంగ్రెస్ గెలిచాయి.
ఎగ్జిట్ పోల్స్ తలకిందులు...
Published Fri, May 20 2016 4:08 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM
Advertisement