న్యూఢిల్లీ: విమానయాన సంస్థలపై 'కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (సీసీఐ) భారీ జరిమానా విధించింది. సరుకు రవాణా చార్జీల వసూళ్లలో భారీ అవకతవలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మూడు సంస్థలపై మొత్తం 258 కోట్ల రూపాయల ఫైన్ విధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆయా విమాన సంస్థలు మండిపడుతుండడంతో వివాదం రగిలింది.
సీసీఐ ఆరోపణలను వ్యతిరేకించిన ఆయా సంస్థలు న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నాయి. తమపై చేసిన ఆరోపణలు చెల్లవంటున్నాయి. తాము ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని వాదిస్తున్నాయి. 2002 ఏవియేషన్ చట్టం నిబంధనల ప్రకారం సీసీఐ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశాయి. గతలో సీసీఐ డైరెక్టర్ జనరల్ చేసిన ఆరోపణలు రుజువు కాలేదని పేర్కొన్నాయి. ఈ విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు దీంతోపాటుగా ఎయిర్ ఇండియా, గో ఎయిర్ లైన్స్ పై కూడా కౌన్సిల్ ఫిర్యాదు చేసినా సీసీఐ ఈ సంస్థలపై ఎలాంటి జరిమానా విధించపోవడానికి ఇవి తప్పు బట్టాయి.
జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు మూకుమ్మడిగా భారీ ఎత్తున అవినీతి పాల్పడ్డాయని ఆరోపించింది. పరోక్షంగా సరుకు రవాణా రేట్లను తమకు అనుకూలంగా నిర్ణయించుకొని, కాంపిటీషన్ చట్టంలోని మూడవ సెక్షన్ నిబంధనలను అతిక్రమించాయని తేల్చిన సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. జెట్ ఎయిర్ వేస్ పై రూ.151.69 కోట్లు, ఇండిగో పై రూ.42.48 కోట్లు, స్పైస్ జెట్ పై 63.74 కోట్లు పెనాల్టీ చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
కాగా విమానయాన రంగంలో సరుకు రవాణా విభాగంలో ఇంధన సర్ చార్జి విషయంలో కొన్ని విమానయాన కంపెనీలు కుమ్మక్క య్యాయంటూ ఎక్స్ ప్రెస్ ఇండస్ర్టీ కౌన్సిల్, సీసీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.