20 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు | Domestic air passenger traffic up by 20 per cent | Sakshi
Sakshi News home page

20 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు

Published Wed, Sep 18 2013 3:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

20 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు

20 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు

న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ ట్రాఫిక్ ఈ ఏడాది ఆగస్టులో 20% వృద్ధి చెందిందని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. వివిధ ఆఫర్ల ద్వారా విమాన చార్జీలు తక్కువగా ఉండడం, 3 సెలవు రోజులు(జన్మాష్టమి, స్వాతంత్య్ర దినోత్సవం, ఈదుల్ ఫితర్) కారణంగా దేశీయంగా విమానయానం పెరిగిందని పేర్కొంది. 
  •   గత ఏడాది ఆగస్టులో 43.69 లక్షల మంది విమానయానం చేయగా ఈ ఏడాది ఆగస్టులో ఈ సంఖ్య 20% వృద్ధితో 52.5 లక్షలకు పెరిగింది. 
  •   ఇండిగో సంస్థ అధిక మార్కెట్ వాటా(29.1%)ను సాధించింది. 25.1% మార్కెట్ వాటాతో జెట్, జెట్‌లైట్‌లు కలిసి రెండో స్థానంలో ఉన్నాయి. ఎయిర్ ఇండియా(19.9%), స్పైస్‌జెట్(17.2%), గో ఎయిర్(8.7%) ఆ తర్వాత ఉన్నాయి. 
  •   ప్యాసింజర్స్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్) విషయంలో ఇండిగోతో పోల్చితే ఎయిర్ ఇండియా ముందంజలో ఉంది. ఎయిర్ ఇండియా పీఎల్‌ఎఫ్ 78.7%గా ఉండగా, ఇండిగో పీఎల్‌ఎఫ్ 76%గా ఉంది. 79% పీఎల్‌ఎఫ్‌తో గో ఎయిర్ మొదటి స్థానంలో నిలిచింది. ఇతర కంపెనీల పీఎల్‌ఎఫ్‌లు ఇలా ఉన్నాయి.. జెట్ (74.9%), జెట్‌లైట్ (73.9%), స్పైస్‌జెట్ (75.8%).
  •   వన్‌టైమ్ పెర్ఫామెన్స్(ఓటీపీ) విషయంలో ఇండిగో 91.4 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో స్పైస్‌జెట్(90.8 శాతం), జెట్, జెట్‌లైట్(88  శాతం),   గో ఎయిర్(84.8 శాతం), ఎయిర్ ఇండియా  (82 శాతం)లు ఉన్నాయి. 
  •   ఓటీపీ విషయంలో విదేశీ విమాన సంస్థల విషయంలో తుర్క్‌మెనిస్తాన్ ఎయిర్‌లైన్స్ వంద శాతం ఓటీపీ సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement