‘సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే.. ఉరి తీయాల్సిందే’
రాంచీ: ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కమాండర్ కుందన్ పహన్ విషయంలో సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనంటూ నిరాహార దీక్షకు దిగిన ఆల్ జార్కండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) ఎమ్మెల్యే వికాస్ ముండా ఎట్టకేలకు తన దీక్షను విరమించారు.
జార్ఖండ్ హోంశాఖ కార్యదర్శి ఎస్‌కేజీ రహతే, అదనపు డీఐజీ ఆర్కే మాలిక్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వెనక్కి తగ్గారు. ఆయన చేసిన డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు దీక్షను విరమించారు. కుందన్ పహన్ లొంగిపోయి స్వేచ్ఛగా తిరగడాన్ని సవాల్ చేస్తూ అతడి విషయంలో సీబీఐ దర్యాప్తు జరగాలని, పలు తప్పిదాలకు పాల్పడిన కుందన్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వికాస్ ముండా ఆదివారం నుంచి ఆమరణ నిరహార దీక్షకు దిగారు.