మావోయిస్టు కీలకనేత లొంగుబాటు | Maoist leader Kundan Pahan surrended to police | Sakshi
Sakshi News home page

మావోయిస్టు కీలకనేత లొంగుబాటు

Published Sun, May 14 2017 5:32 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

మావోయిస్టు కీలకనేత లొంగుబాటు - Sakshi

మావోయిస్టు కీలకనేత లొంగుబాటు

రాంచీ: మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లో కరుడుగట్టిన మావోయిస్టు కీలకనేత నేత పోలీసులకు లొంగిపోయాడు. జార్ఖండ్‌ రీజినల్‌ కమిటీ కార్యదర్శి, కుందన్‌ పహాన్‌ పలు సీనియర్‌ పోలీసు అధికారుల హత్యలతోపాటు 128 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతని తలపై రూ.15 లక్షల రివార్డు కూడా ఉంది. 2008లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫ్రాన్సిస్‌ ఇంద్రవర్‌ను హత్య చేయడంతోపాటు, 2008లో ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన నగదు వాహనం నుంచి రూ. 5 కోట్లు లూటీ చేసిన కేసులోనూ నిందితుడు.

2008లో బలిబా దాడిలో డీఎస్పీ ప్రమోద్‌కుమార్‌ను హత్య చేశాడని రాంచీ సీనియర్‌ ఎస్పీ(ఎస్‌ఎస్‌పీ) కుల్‌దీప్‌ దివేది తెలిపారు. అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు ఆర్‌.కె.మాలిక్‌, సీఆర్పీఎఫ్‌ ఐజీ సంజయ్‌ లత్‌కర్‌, డీఐజీ ఎ.వి.హాంకర్‌, సీనియర్‌ పోలీసుల ఎదుట అతను లొంగిపోయాడు. జన జీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నించిన కుందన్‌ పహాన్‌కు పలువురు పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement