రెచ్చిపోయిన మావోయిస్టులు | maoists hulchul in jharkhand | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన మావోయిస్టులు

Published Fri, Apr 14 2017 12:57 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

maoists hulchul in jharkhand

రాంచి(జార్ఖండ్‌): జార్ఖండ్‌ రాష్ట్రం పలమావు జిల్లాలో మావోయిస్టులు హల్‌చల్‌ చేశారు. ఒక జేసీబీని, ఒక బైక్‌ను, 11 ట్రాక్టర్లను అగ్నికి ఆహుతి చేశారు. పిపిరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సరాయా గ్రామ సమీపంలో జరుగుతున్న ఓ నిర్మాణం వద్దకు గురువారం సాయంత్రం చేరుకున్న మావోయిస్టులు నిర్మాణంలో వాడుతున్న వాహనాలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దీంతో అవన్నీ కాలి బూడిదయ్యాయి. వారు అడిగినంత మేర మామూళ్లు ఇవ్వనందునే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధిత కాంట్రాక్టర్‌ తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement