బంగారం గనుల వేలానికి సిద్ధం | Jharkhand ready to auction gold mines next month | Sakshi
Sakshi News home page

బంగారం గనుల వేలానికి సిద్ధం

Published Fri, Apr 22 2016 1:52 PM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

బంగారం గనుల వేలానికి సిద్ధం

బంగారం గనుల వేలానికి సిద్ధం

న్యూఢిల్లీ: బంగారు గనుల వేలానికి జార్ఖండ్ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఇందుకు సంబంధించిన టెండర్లను పిలవనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది. వెస్ట్ సింగ్‌భమ్ జిల్లాలోని పహర్డియా, రాంచీ జిల్లాలోని పరసి బ్లాక్‌లకు టెండర్లను ఆహ్వానించినట్లు ఒక సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు.

ఈ ఏడాది ప్రారంభంలో మొదటిసారిగా పహర్డియా బ్లాక్‌కు టెండర్లను ఆహ్వానించగా మైనింగ్ దిగ్గజం వేదాంత సహా మూడు కంపెనీలు ఆసక్తి కనబరచాయని చెప్పారు. అయితే ఆ తర్వాత ఇవి వేలంలో పాల్గొనలేదని తెలిపారు. దీంతో ఆ బిడ్లను పక్కన పెట్టి తాజాగా మళ్లీ బిడ్లను ఆహ్వానించినట్లు వివరించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లో మొదటిసారిగా బంగారు గనుల వేలం జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement