
తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వండి
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని మోడీని కోరారు. తెలంగాణకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కేసీఆర్ మోడీకి విన్నవించారు. 14 అంశాలపై ప్రధాని మోడీకి కేసీఆర్ వినతిపత్రం సమర్పించారు. వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలి
ప్రాణహిత - చేవెళ్లను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలి
తెలంగాణకు పన్ను రాయితీలు ఇవ్వాలి
4 వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
ఏపీకి త్వరగా ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిచాలి
మూసి నది ఆధునీకరణకు తోడ్పాటు అందించాలి
ఉద్యానవన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి
తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి
వెనుకబడిన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలి
తెలంగాణలో 4,207 కి.మీ జాతీయ రహదారికి సహకరించాలి
ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు
తెలంగాణ పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలి
అటవీ శాఖ నుంచి 30 శాతం నిధులు ఇవ్వాలి