కే జే అల్ఫోన్స్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : వర్షాలు తెరిపివ్వడంతో కేరళలో వరద ఉధృతి తగ్గింది. ప్రజలు సహాయక శిబిరాల నుంచి వారి వారి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇళ్లకు అయితే చేరుకున్నారు, కానీ ప్రస్తుతం అవి ఏ మాత్రం నివాసయోగ్యంగా లేవు. వాటికి తిరిగి వాటి పూర్వ రూపం కావడం చాలా కష్టం. ఇటువంటి సమయంలో కేరళవాసులను ఆదుకోవాడనికి ప్రజలు ముందుకు రావాలని, ఇళ్లను మరమ్మత్తు చేసుకోడానికి అవసరమైన ప్లంబర్‌లు, ఎలక్ట్రిషన్‌లు, కార్పెంటర్స్ వేలాదిగా తరలి రావాలంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కే జే అల్ఫోన్స్ పిలుపునిచ్చారు.
సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకున్న వారికి అవసరమైన సాయం చేయాలంటూ ఆయన వరుస ట్వీట్‌లు చేశారు. ఈ సందర్భంగా అల్ఫోన్స్ ‘ఈ సమయంలో అంటువ్యాధుల ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అందుకే డాక్టర్లను, నర్సులను గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాక ప్రజలుకు అవసరమైన బట్టలు, తినడానికి వీలుగా ఉండేలా ‘రెడీ టూ ఈట్ ఫుడ్’ను అందిచాల్సిందిగా కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సహాయక శిబిరాల్లో ఉన్న వారికి పాలు సరాఫరా చేసిన నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డును కూడా అల్ఫోన్స్ అభినందించారు.
As the flood is receding in Kerala people have to move to whatever is left of their homes . Need ready to eat cooked food , clothes and an army of electricians, plumbers and carpenters @narendramodi @AmitShah @BJP4India @BJP4Keralam
— Alphons KJ (@alphonstourism) August 21, 2018
Comments
Please login to add a commentAdd a comment