బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే.. కర్ణాటకలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య తక్కువగా ఉందని ఓ ఆంగ్ల పత్రిక పరిశీలనలో తేలింది. ప్రతి 10 లక్షల మందికి కర్ణాటకలో 182.3 పరీక్షలు మాత్రమే జరుగుతుండగా, కేరళలో ఆ సంఖ్య 483.1, తమిళనాడులో 285, ఆంధ్రప్రదేశ్‌లో 217.5గా ఉంది. తెలంగాణ రాష్ట్ర గణాంకాలు అందుబాటులో లేవని ఆ పత్రిక పేర్కొంది. చైనా నుంచి రావాల్సిన టెస్టింగ్ కిట్లు ఇంకా రాకపోవడం వల్ల కర్ణాటకలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే, తమ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచామని కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీన 415 పరీక్షలు జరపగా, ఏప్రిల్ 16న 1,241 పరీక్షలు జరిపామన్నారు. కాగా, చైనా నుంచి దాదాపు లక్ష టెస్టింగ్ కిట్లు ఆదివారంనాటికల్లా రాష్ట్రానికి చేరుకునే అవకాశముందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment