బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కోసం రూపొందించిన అధికారిక జెండాను ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆవిష్కరించారు. ‘నాద ధ్వజ’గా పేర్కొంటున్న ఈ జెండాలో పసుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతోపాటు మధ్యలో రాష్ట్ర చిహ్నమైన ‘గండభేరుండ’ ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండాలన్నది కన్నడిగుల అభిప్రాయం, ఆకాంక్ష అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు.
దీనిని శుక్రవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు ప్రత్యేక పతాకం ఉండకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. జాతీయ జెండానే అత్యున్నతమనీ, రాష్ట్ర జెండా కంటే ఎత్తులో ఉంటుందనీ వివరించారు. కాగా, ప్రస్తుతం దేశంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక జెండా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment