కార్తికి విదేశాల్లో ఆస్తులన్నాయి : సీబీఐ
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని సీబీఐ సుప్రీంకోర్టుకు మంగళవారం తెలిపింది. విదేశాల్లో కార్తికి మొత్తం 25 ఆస్తులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ తెలిపింది. కార్తికి విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టుకు సీబీఐ సీల్డ్ కవర్‌లో అందించింది.
దీనిపై కార్తి చిదంబరం తరఫు న్యాయవాది కపిల్‌సిబల్.. విదేశాల్లో కార్తికి ఆస్తులున్నాయడం అవాస్తవమని కోర్టుకు చెప్పారు. ఒకవేళ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ లేదా సీబీఐ కార్తికి ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే.. వాటిని ప్రభుత్వానికి ఇచ్చేస్తామని చెప్పారు.
సిబల్ వాదనలకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఆ ఆస్తులన్నీ షెల్ కంపెనీ పేరు మీదే ఉన్నా.. వాటి నిర్వహణ అంతా కార్తీనే చూస్తున్నారని చెప్పారు.