'విజయ్' ఆహారం 10 కేజీల మాంసం! | 'Killer white tiger eats 10 kg meat daily' | Sakshi
Sakshi News home page

'విజయ్' ఆహారం 10 కేజీల మాంసం!

Published Tue, Sep 23 2014 7:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

'విజయ్' ఆహారం 10 కేజీల మాంసం!

'విజయ్' ఆహారం 10 కేజీల మాంసం!

న్యూఢిల్లీ: ఢిల్లీ జంతు ప్రదర్శన శాలలో ఓ విద్యార్ధిని పొట్టన పెట్టుకున్న తెల్ల పులి ప్రతి రోజు సుమారు 12 కేజీల మాంసం తింటుందని జూ అధికారులు వెల్లడించారు. తెల్లపులి పేరు విజయ్ అని, ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మీడియాకు తెలిపారు. 
 
2007లో లక్ష్మణ్, యమున అనే పులి దంపతులకు జన్మించిన విజయ్ బరువు 200 కిలో గ్రాములు ఉందని ఓ ప్రశ్నకు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తన ఎన్ క్లోజర్ లోకి దూకిన ఓ 20 ఏళ్ల వ్యక్తి విజయ్ చేతిలో ప్రాణాలు వదిలాడు. ఈ ఎన్ క్లోజర్ లో మరో రెండు పులులు కూడా ఉన్నాయని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement