![Kolkata Man Ordered Communist Manifesto Got Bhagavad Gita - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/15/amazon.jpg.webp?itok=7jEstvg9)
కోల్‌కతా: ఆన్‌లైన్‌లో కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో బుక్ చేసిన వ్యక్తికి.. భగవద్గీత రావడంతో షాక్ తిన్నాడు. కోల్‌కతాకు చెందిన సుతీర్థో దాస్ అనే వ్యక్తికి ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘గత బుధవారం అమెజాన్‌లో కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టోపై మంచి డిస్కౌంట్ ఉంది. రూ.90 విలువైన పుస్తకం డిస్కౌంట్ తర్వాత 50 రూపాయలకు లభిస్తుంది. డెలివరీ చార్జెస్ కలుపుకుని రూ.140కు దొరుకుతుంది. దాంతో ఆ బుక్‌ను ఆర్డర్ చేశాను. ఈ నెల 12,13న బుక్ డెలివరీ చేస్తామని మెసేజ్ వచ్చింది. శనివారం(జూన్ 13) నాడు మధ్యాహ్నం 2 గంటలకు నేను అమెజాన్‌లో ఆర్డర్ చేసిన కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో పుస్తకం ఇంటికి వచ్చినట్లు నా కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్లి పార్సల్ తెరచి షాక్ అయ్యాను. ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో ఆర్డర్ చేస్తే.. నాకు భగవద్గీతను డెలివరీ చేశారు. పార్సిల్ పైన కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో అని రాసి ఉండటం గమనార్హం’ అంటూ తన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీనిపై చాలా మంది నెటిజనులు స్పందించారు. తమకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment