ముఖేశ్ అంబానీతో కేటీఆర్ భేటీ
ముంబై: వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీతో కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్లో రిలయన్స్ పెట్టుబడులపై ఆయన ముఖేశ్తో చర్చించారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు.
ఈ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే హైదరాబాద్ లో సుడిగాలి పర్యటన చేసిన కేటీఆర్ నగరంలో పేదలకు త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్ల కలను సాకారం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఒక్క రోజు గ్యాప్ లోనే ముంబయికి పయనమైన కేటీఆర్ అవే డబుల్ బెడ్ రూమ్ పథకం గురించి టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు ఈ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు అంగీకరించారు. ఆ వెంటనే కేటీఆర్ ముఖేశ్ అంబానీతో తాజాగా భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.