'అభివృద్ధి కోసమే భూసేకరణ బిల్లు'
కొలంబియా వర్సిటీ విద్యార్థులతో జైట్లీ
న్యూయార్క్: భూసేకరణ బిల్లుపై తీవ్ర నిరసనలు వస్తుండటంతో దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా భూ సేకరణ బిల్లు-2013లో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.సహజంగానే ప్రజలెవరైనా తమ భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉండరని, ఇలాంటి చట్టాలను ఆమోదించుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన జైట్లీ సోమవారం ఇక్కడి కొలంబియా వర్సిటీకి చెందిన అంతర్జాతీయ వ్యవహారాల విభాగం విద్యార్థులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.