లతా మంగేష్కర్ మెచ్చుకున్నారు
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ప్రారంభించిన 'బేటీ బచావో - బేటీ పడావో' ప్రచార కార్యక్రమాన్ని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల దేశంలో ఆడపిల్లలకు రక్షణ దొరుకుతుందని, శిశుహత్యలకు చెక్ పెట్టవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
'మోదీజీ నమస్కారం. సరస్వతీ దేవి పండుగను వసంత పంచమిగా చేయటం ఆనందకరం. ఇది మహిళా శక్తికి నిదర్శనం. మీరు ప్రారంభించిన 'బేటీ బచావో - బేటీ పడావో' మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు.
ఈ నెల 22 న బేటీ బచావో - బేటీ పడావో ప్రచార కార్యక్రమాన్ని నరేంద్రమోదీ హర్యానాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. శిశుహత్యలపై ప్రజలకు అవగాహన కల్పించటం, దేశంలో లింగ నిష్పత్తిని పెంచటం దీని ప్రధాన లక్ష్యం.