సాక్షి, ముంబై: దేశంలో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన మహారాష్ట్రలో కరోనా పేషెంట్ల బట్టలు ఉతకడానికి ధోబీలు ససేమీరా అంటున్నారు. తమకూ ఆ వైరస్ సోకుతుందేమోననన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. సాధారణంగా ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో వినియోగించే వస్త్రాలను స్థానికంగా పనిచేసే ధోబీలతో ఉతికిస్తారు. అదే విధంగా మహారాష్ట్రలోని యవత్మల్ స్థానిక ఆసుపత్రిలో సోమవారం అన్ని వార్డులతో పాటు ఐసోలేషన్ వార్డులో వినియోగించిన బెడ్ షీట్లు, కర్టెన్లు, పేషెంట్ల వస్త్రాలను ఉతకమని ధోబీలకు అందించారు. కానీ వారు తాము ఆ పని చేయలేమంటూ చేతులెత్తేశారు. ఐసోలేషన్ వార్డులో ఉపయోగించిన బట్టలు ముట్టుకుంటే తమకు ఆ వైరస్ సోకుతుందేమోనని భయంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అశోక్ చౌదరి అనే వ్యక్తి పేర్కొన్నాడు. కాగా కరోనా అనుమానితులను, వ్యాధిగ్రస్తులను ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.(కరోనా: యూరప్, ఆసియాలో అత్యధిక మరణాలు)
Comments
Please login to add a commentAdd a comment