లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమ్యారు. దీంతో అడవి తీరంలోని గ్రామాల్లో సింహాలు, పులులు సంచరిస్తూ కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ చిరుత పులి రాజస్థాన్‌లోని ఓ ఇంటిలో ఏకంగా తన మూడు పిల్లలతో కలిసి నివాసం ఏర్పరుచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీ ఫుటేజ్‌లో రికార్డైనా ఈ వీడియోను ఆటవీ అధికారి పర్వీన్ కశ్వన్ గురువారం ట్విటర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో రాత్రి తిరిగి ఇంటికి వచ్చిన చిరుత.. తన పిల్లలను నోటితో కరుచుకుని తీసుకువెళ్తు కనిపించింది. ఇక ఈ వీడియోకు ఇప్పటీ వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘ఈ వీడియో పంచుకున్నందుకు ధన్యవాదాలు’, ‘ఇది అద్బుతం’ ‘ఎంత ముద్దుగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చండీగఢ్‌లో అడవి జంతువు కలకలం!)
While everybody was inside the mother #leopard found an unused house & started raising her three cubs. In Tantol village of Rajasmand. Mother is coming in night & in daytime she goes for food. Cubs are doing fine. So now dept has put staff & cameras to monitor things. VC Raj FD. pic.twitter.com/zDIbhKKUvf
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 16, 2020
అయితే ఆ ఇంటి ముందు సీసీ కెమారాలను ఏర్పాటు చేసి నిరంతరం చిరుత కదలికలను అధికారులు గమనిస్తున్నట్లు పర్విన్ తెలిపాడు. 21 సెకన్ల నిడివి గల ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితయ్యారు. ఈ క్రమంలో ఈ తల్లి చిరుత కూడా నివాసం కోసం తంటోల్ గ్రామంలోని పాతబడిన కోటను తన పిల్లల కోసం నివాసం చేసుకుంది. ఇక ఈ చిరుత రోజంతా ఆహార వేటకు వెళ్లి తిరిగి రాత్రిపూట తన పిల్లల దగ్గరికి వస్తుంది. ప్రసుతం చిరుత పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment