న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్పై ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్లో 100 కంటే ఎక్కువ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తాజా బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు రాష్ట్రాలకు కొత్త రైళ్లను తీసుకొచ్చే సూచనలు కనిస్తున్నాయి. ప్రతి ఏడాది సుమారు 150-180 కొత్త రెళ్లను బడ్జెట్లో ప్రవేశపెట్టేవారు. గతేడాది 160 రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగానే ఈ ఏడాది కూడా మరో వందకి పైగా రెళ్లను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
కాగా నూతన బడ్జెట్ 2015-16 ను ఫిబ్రవరి 26న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అధనంగా నిధులు సమకూర్చడంతో పాటు వాటిని అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచిస్తున్నారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. రైళ్లపై ప్రముఖ బ్రాండ్ కంపెనీలు 'కోకా కోలా ఎక్స్ప్రెస్', 'హల్దీరామ్' ప్రకటనలు తీసుకునేందుకు మంత్రి సురేశ్ ప్రభు సిద్ధమైనట్టు సమాచారం. జనరల్, సెకండ్ క్లాస్ బోగీలుండే 'సాధారణ్ ఎక్స్ప్రెస్' రైలు సర్వీసులను సామాన్యులకు అందుబాటులో ఉండేలా తీసుకురానున్నారు. కొన్ని ముఖ్య ప్రాంతాలకు సందర్శకులను దృష్టిలో ఉంచుకుని కొత్త సర్వీసులను ప్రవేశపెట్టనున్నారు.
వంద రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
Published Sun, Feb 22 2015 11:20 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement