‘పుస్తకంలాగా పొట్టను తెరవాల్సి వచ్చింది’ | Liquid Nitrogen In Cocktail Nearly Killed Delhi Man | Sakshi
Sakshi News home page

‘పుస్తకంలాగా పొట్టను తెరవాల్సి వచ్చింది’

Published Tue, Jul 4 2017 3:05 PM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

‘పుస్తకంలాగా పొట్టను తెరవాల్సి వచ్చింది’

‘పుస్తకంలాగా పొట్టను తెరవాల్సి వచ్చింది’

న్యూఢిల్లీ: కాక్‌టెయిల్‌ తాగిన ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార వేత్త దాదాపు చావు అంచులకు వెళ్లాడు. ఎందుకంటే అతడు తాగింది.. కాక్‌టెయిల్‌ మాత్రమే కాదు.. అందులో లిక్కిడ్‌ నైట్రోజన్‌ కూడా కలిసి ఉంది. దీంతో తాగిన కొద్ది సేపటికే అతడి కడుపులో  ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు పడిపోయాయి. దీంతో వేరే దారిలేక వైద్యులు అతడి పొట్టను తెరిచిన పుస్తకం మాదిరిగా చీల్చి శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది. ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త అయిన ఓ 30 ఏళ్ల వ్యక్తి గుర్గావ్‌లోని పబ్‌కు వెళ్లాడు. మెనూ చూసి కొత్తగా వచ్చిన కాక్‌టెయిల్‌ ట్రై చేయాలని నిర్ణయించుకున్నాడు.

పొగలు కక్కుతున్నప్పటికీ అందులో లిక్విడ్‌ నైట్రోజన్‌ ఉందనే విషయం గుర్తించకుండా గబాళ్లున తాగేశాడు. కడుపులోపల ఆందోళనగా అనిపించినా అదేం పట్టించుకోకుండా మరో మందు తీసుకొని తాగేశాడు. కొద్ది సెకన్లలోని అతడి కడుపులో ఒక రకమైన భరించలేని నొప్పరావడంతోపాటు శ్వాసతీసుకోవడం కష్టమైపోయింది. భరించలేని వాసన రావడం ప్రారంభమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా అతడి కడుపు లోపల రెండు రంద్రాలు అయినట్లు గుర్తించారు. దీంతో అతడికి వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేశారు. సాధారణంగా లిక్విడ్‌ నైట్రోజన్‌ లోపలికి వెళ్లాక అది బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని, ఆ క్రమంలో అవసరం అయితే, పొట్ట పేలిపోతుందని కూడా వైద్యులు హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement