రాహుల్తో అద్వానీ ముచ్చట్లు | lk advani sat side of rahul gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్తో అద్వానీ ముచ్చట్లు

Published Sun, Dec 6 2015 9:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాహుల్తో అద్వానీ ముచ్చట్లు - Sakshi

రాహుల్తో అద్వానీ ముచ్చట్లు

న్యూఢిల్లీ: రెండు ప్రధాన పార్టీల నేతలు, మొదటి నుంచే ఒకరికొకరు ప్రతిపక్షంగా ఉన్న నేతలు పక్కపక్కనే ఒకే సీట్లో కూర్చున్నారు. కాకపోతే ఒకరు రాజకీయాల్లో కురువృద్ధుడుకాగా, మరొకరు ఇప్పుడిప్పుడే రాజకీయాలను అవపోసనపడుతున్నవారు. ఆదివారం ఉదయం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

భారత రాజ్యాంగ పిత, భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఏవో కబుర్లు రాహుల్కు చెప్పుతూ అద్వానీ నవ్వుతూ కనిపించారు. అంబేద్కర్కు నివాళి అర్పించినవారిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement