న్యూఢిల్లీ: దగ్గు, జ్వరం, గొంతు నొప్పిని కోవిడ్ లక్షణాలుగా భావిస్తున్నారు. ఇలాంటి లక్షణాలున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. రుచి, వాసన గ్రహించే శక్తిని అకస్మాత్తుగా కోల్పోవడం వైరస్ ప్రభావానికి సంకేతమని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ శక్తిని కోల్పోయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని, కరోనా లక్షణాల్లో వీటిని కూడా చేర్చాలని యోచిస్తోంది. కోవిడ్–19పై ఏర్పాటైన టాస్క్‌ఫోర్సు సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అమెరికా ఆరోగ్య శాఖ కూడా ఇలాంటి లక్షణాలను కరోనా మహమ్మారికి సూచికగా గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment