తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటలలో వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది.
విశాఖపట్నం: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటలలో వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. అయితే వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై ఉండదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒడిషా నుంచి దక్షిణ కోస్తామీదగా తమిళనాడు వరకు ద్రోణి ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటలలో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో ఈ రోజు రాయలసీమ, కోస్తా ఆంధ్రలలో వర్షం పడే అవకాశం ఉంది. సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.