
ఎన్‌సీసీ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ వినోద్
న్యూఢిల్లీ: నేషనల్ క్యాడెట్ కోర్(ఎస్‌సీసీ) నూతన డైరెక్టర్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ వినోద్ వశిష్ట్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టక ముందు ఈయన గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కమాండెంట్‌గా విధులు నిర్వర్తించారు. తమిళనాడులోని విల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో ఈయన గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్సు, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేశారు.