మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేష్ యాదవ్ రాజీనామా
మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేష్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన స్కాంలో ఆయన కుమారుడు నిందితుడిగా ఉండటం, ఆయనపై కూడా సిట్ బృందం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఆయన రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇక చాలు.. ఈ పదవి నుంచి వైదొలగాలని ఆదేశించడంతో రాం నరేష్ యాదవ్ తన పదవికి బుధవారం నాడు రాజీనామా చేశారు.
దీంతో ఇటీవలి కాలంలో ఆరోపణల కారణంగా బలవంతంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన గవర్నర్ల జాబితాలోకి ఆయన కూడా చేరారు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించిన ఎన్డీ తివారీ కూడా ఆరోపణల కారణంగానే తన పదవి పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.