madhya pradesh governor
-
మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఓపీ కోహ్లీ
మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఓం ప్రకాశ్ కోహ్లీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రధేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేంద్ర మీనన్ రాజ్‌భవన్ లో బీజేపీ సీనియర్ నేత కోహ్లీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ పదవీ కాలం బుధవారం ముగియడంతో ప్రస్తుతం గుజరాత్ గవర్నర్ అయిన ఓ.పీ.కోహ్లీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
వ్యాపం స్కాంలో ఎ-10 గవర్నరేనా?
దేశాన్నే వణికిస్తున్న వ్యాపం స్కాంలో పెద్దవాళ్లు ఎవరినీ వదల్లేదని, అందరినీ బుక్ చేస్తున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెబుతున్నా.. ఈ కేసులో మాత్రం ఓ పెద్ద చేప విచారణ నుంచి తప్పించుకుందనే అంటున్నారు. గవర్నర్ రాం నరేష్ యాదవ్‌ను ఈ కేసులో ఎ-10గా చేర్చారని, అయితే.. రాజ్యాంగపరమైన రక్షణ ఉండటంతో ఆయనపై విచారణను చేపట్టకుండా ఆపేశారని అంటున్నారు. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి బయటపెట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. దొరికిన ఆధారాలను బట్టి చూస్తే గవర్నర్‌పై విచారణ చేపట్టాల్సిందేనని, ఇప్పుడు అలా చేయకపోవడం చూస్తుంటే ముఖ్యమంత్రిని రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ స్కాంలో సీఎం చౌహాన్‌తో పాటు ఆయన భార్య కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్‌ను తొలగించాల్సిందేనని, అలా చేస్తే ఆయన మొత్తం గుట్టంతా విప్పుతారనే బీజేపీ భయపడుతోందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషన్ విమర్శంచారు. గవర్నర్ పదవి నుంచి రాం నరేష్ యాదవ్‌ను తొలగించాలంటూ దాఖలైన కేసుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. -
గవర్నర్‌ను కాపాడుతున్నదేమిటి?
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై వ్యాపమ్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫారెస్టు గార్డులుగా నియామకానికి ఐదుగురి పేర్లను ఆయన సిఫారసు చేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. నిజానికి నైతిక బాధ్యతతో ఆయన తక్షణం గవర్నర్ పదవికి రాజీనామా చేయాలి లేదా కేంద్రమైనా ఆయనను అలా చేయమనాలి. ఈ రెండూ జరగలేదు. గవర్నర్‌గా తనకు రాజ్యాంగపర రక్షణ ఉన్నందున(పదవిలో ఉండగా క్రిమినల్ కేసులో విచారించడం కుదరదు) ఎఫ్ఐఆర్ నుంచి తన పేరు తొలగించాలని ఆయన హైకోర్టుకు వెళ్లి ఉపశమనం పొందారు. ఇంతజరిగినా కేంద్రంలోని మోదీ సర్కారు రామ్‌నరేశ్ జోలికి వెళ్లలేదు. నిజానికి యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన షీలా దీక్షిత్, బి.ఎల్.జోషి, శేఖర్‌దత్ తదితరులను ‘రాజీనామా’ చేసి వెళ్లిపోయేలా చేసిన మోదీ ప్రభుత్వానికి మరి కాంగ్రెస్‌కు చెందిన, అపఖ్యాతి మూటగట్టుకున్న రామ్‌నరేశ్‌పై ప్రత్యేకప్రేమ ఎందుకు? గవర్నర్‌కు గతంలో ఓఎస్డీగా పనిచేసిన ధన్‌రాజ్‌యాదవ్, స్వయంగా గవర్నర్ కుమారుడు శైలేష్ యాదవ్(ఈయన మార్చిలో అనుమానాస్పదంగా మృతిచెందారు) కూడా ఈ స్కాం నిందితులే. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దగ్గరి బంధువులకు ఈ స్కాంతో సంబంధముందని ఆరోపణలున్నాయి. గవర్నర్‌గా రామ్‌నరేశ్‌ను సాగనంపితే... రాజ్యాంగపర రక్షణ తొలగిపోయి వెంటనే ఆయనపై కేసు నమోదవుతుంది. సిట్ విచారణలో ఆయన మరిన్ని విషయాలు వెల్లడిస్తే... తెరవెనకున్న పెద్దలకు ఇబ్బందే. గవర్నర్ హోదాలో వ్యాపమ్‌కు సంబంధించిన కీలక ఫైళ్లు, నిర్ణయాలు, సమాచారం రామ్‌నరేశ్ దగ్గరకు వచ్చాయి. మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనేది ఆయనకు లోతుగా తెలుసు. కాబట్టే కేంద్రం ఆయన జోలికి వెళ్లలేదన్న అభిప్రాయం నెలకొంది. 2011లో గవర్నర్‌గా నియమితులైన ఆయన పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టుతో ముగుస్తుంది. -
'గవర్నర్ తొలిగింపు' దావాను స్వీకరించిన సుప్రీంకోర్టు
-
'గవర్నర్ తొలగింపు' దావాను స్వీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సంచలనాత్మక వ్యాపం స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్‌ను తొలగించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిచంది. తీవ్రస్థాయిలో ఆరోపణలను ఎదుర్కొంటున్న కారణంగా పదవి నుంచి తప్పుకోవాలని కేంద్రప్రభుత్వం గతంలోనే ఆయనను ఆదేశించినప్పటికీ రాంనరేశ్ యాదవ్ మాత్రం ఇప్పటికీ గవర్నర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పదవినుంచి తొలిగించాల్సిందిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణంలో గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడు శైలేశ్ యాదవ్ ప్రధాన ముద్దాయి. కాగా గత మార్చిలో శైలేశ్ అనుమానాస్పద రీతితో మరణించారు. గవర్నర్ రాంనరేశ్ యాదవ్ పాత్రకూడా నిర్ధారణ కావడంతో కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్.. హైకోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్లో గవర్నర్ పేను చేర్చింది. ఇప్పటివరకు ఈ కేసులో 2 వేల మందికిపైగా అరస్టుకాగా, మరో 800 మందిని తర్వరలో అరెస్టుచేస్తారనే వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు నిందితులు, సాక్షులు వరుసగా చనిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
రాజీనామా చేయండి...
- మధ్యప్రదేశ్ గవర్నర్‌కు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డులో జరిగిన రిక్రూట్మెంట్ స్కాంలో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనందున రాజీనామా చేయాలంటూ ఆయనను కేంద్రం ఆదేశించింది. కేసు వ్యవహారంపై నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ కోరినట్లు సమాచారం. అయితే, యాదవ్ బుధవారం రాజీనామా చేసినట్లు మీడియాలో తొలుత కథనాలు వెలువడ్డాయి. కానీ ఆయన రాజీనామా చేయలేదని రాజ్‌భవన్ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు యాదవ్‌పై కేసు నమోదైంది. ఐదుగురి పేర్లను ఫారెస్ట్ గార్డుల కొలువులకు యాదవ్ సిఫార్సు చేసినట్లు, కాంట్రాక్టు టీచర్ల నియామకం కోసం యాదవ్ కుమారుడు శైలేశ్ డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బుధవారం భోపాల్‌లో యాదవ్‌తో మిజోరం గవర్నర్ అజీజ్ ఖురేషీ రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఖురేషీ ద్వారా రాష్ట్రపతి అపాయింట్మెంట్ను యాదవ్ కోరినట్లు సమాచారం. -
మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేష్ యాదవ్ రాజీనామా
మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేష్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన స్కాంలో ఆయన కుమారుడు నిందితుడిగా ఉండటం, ఆయనపై కూడా సిట్ బృందం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఆయన రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇక చాలు.. ఈ పదవి నుంచి వైదొలగాలని ఆదేశించడంతో రాం నరేష్ యాదవ్ తన పదవికి బుధవారం నాడు రాజీనామా చేశారు. దీంతో ఇటీవలి కాలంలో ఆరోపణల కారణంగా బలవంతంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన గవర్నర్ల జాబితాలోకి ఆయన కూడా చేరారు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరించిన ఎన్డీ తివారీ కూడా ఆరోపణల కారణంగానే తన పదవి పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.