'కొడుకు లేడని.. బతికే హక్కులేదన్నాడు' | Man Allegedly Kills Wife For Being Unable To Bear Son | Sakshi
Sakshi News home page

'కొడుకు లేడని.. బతికే హక్కులేదన్నాడు'

Published Fri, Jun 3 2016 6:46 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

'కొడుకు లేడని.. బతికే హక్కులేదన్నాడు' - Sakshi

'కొడుకు లేడని.. బతికే హక్కులేదన్నాడు'

వడోదర: వరుసగా నాలుగో కాన్పులోనూ ఆడపిల్లకు జన్మనిచ్చిందని, మగపిల్లాడిని కనలేదని కోపంతో ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. ఆమెను ఈడ్చుకెళ్లి బావిలో తోసేయడంతో నీళ్లో మునిగి చనిపోయింది. గుజరాత్ రాష్ట్రంలో వడోదరకు 90 కిలోమీటర్ల దూరంలోని గోద్రా తాలుకా బగిడోల్ గ్రామంలో ఇటీవల ఈ దారుణం జరిగింది.

మృతురాలిని హేతల్ పర్మార్గా పోలీసులు గుర్తించారు. ఆమెకు నలుగురు ఆడపిల్లలు సంతానం. మగపిల్లాడిని కనలేదనే కారణంతో హేతల్ను ఆమె భర్త జితేంద్ర, అత్తింటివారు వేధించేవారు. ఈ విషయంపై జితేంద్ర తరచూ గొడవపడుతుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసగా నలుగురు ఆడిపిల్లలకు జన్మనిచ్చావని, కొడుకును కనందుకు భూమిపై జీవించే హక్కులేదని జితేంద్ర.. భార్యతో గొడవపడినట్టు తెలిపారు. భార్యను హత్య చేసిన తర్వాత జితేంద్ర పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement