ప్రస్తుతం అనేక దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బర్త్‌డే, పెళ్లి రోజు వేడుకులను సన్నిహితులు, స్నేహితులతో జరుపుకునే వీలు లేకుండా పోయింది. దీంతో క్వారంటైన్‌లోఉన్న కొంతమంది పుట్టినరోజు, పెళ్లిరోజును వినూత్నంగా జరుపుకుంటున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బర్త్ డే వేడుకలను ఫన్నీగా సెలబ్రెట్ చేసుకుంటున్న వీడియోలు మాత్రం నవ్వులు పూయిస్తున్నాయి. (లాక్‌డౌన్: ‘ఖైదీననే భావన కలుగుతోంది’)
ఓ వ్యక్తి వినూత్నంగా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న టిక్‌టాక్ వీడియోను మంగళవారం ట్విటర్‌లో షేర్ చేశారు. ‘ఎవరూ లేరు.. ఏప్రిల్, మే, జూన్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో.. ఓ వ్యక్తి ఫేస్ మాస్క్ ధరించి తన బర్త్ డే కేక్ ముందు కుర్చున్నాడు. కొంతమంది బర్త్ డే పాట పాడుతుండగా ఆ వ్యక్తి హేర్ డ్రయ్యర్‌తో క్యాండిల్స్‌ను ఆర్పాడు. ఇక కెమారాను అతిథుల వైపు తిప్పగానే.. వాళ్లంతా వీడియో కాల్ ద్వారా ఈ వేడుకలో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటీ వరకు ఈ వీడియోకు 2.7 మిలియన్ల వ్యూస్ రాగా.. వేలల్లో లేక్‌లు వచ్చాయి. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. (కరోనా నుంచి రేష్మ కోలుకుంది..)
no one:
— V (@digbickvibes) April 5, 2020
april may and june birthdays: pic.twitter.com/1IjwBpKYxf
‘నా బర్త్ డే కూడా ఇంకా 4 రోజుల్లో వస్తుంది.. ఈ ఐడియా బాగుంది’ ‘ఈ జాబితాలో జులై నెల లేదు సంతోషం‘ ‘జూన్ నెల తీసేయండి ప్లీజ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కరోనా వైరస్ మహమ్మారిక వ్యాప్తిని అరికట్టడానికి దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మార్చిలో ప్రారంభమైన లాక్‌డౌన్ ఇక ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ మే వరకూ కొనసాగే అవకాశం ఉందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment