మహమ్మారి మందు తాగి మృత్యువాత.. | Man Deceased After Consuming Syrup He Invented To Cure COVID-19 | Sakshi
Sakshi News home page

కోవిడ్‌-19 : మందు కనిపెడతామంటూ మరణించాడు

Published Fri, May 8 2020 5:19 PM | Last Updated on Fri, May 8 2020 5:20 PM

Man Deceased After Consuming Syrup He Invented To Cure COVID-19 - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

చెన్నై : కోవిడ్‌-19 వైరస్‌కు వ్యాక్సిన్‌, చికిత్సను కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో తమిళనాడులోని బయోటెక్‌ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి కోవిడ్‌-19 చికిత్స కోసం తాము కనుగొన్న దగ్గు మందు ఫార్ములాను సేవించి మృత్యువాత పడిన ఘటన వెలుగుచూసింది. కరోనా వైరస్‌కు మందును కనుగొనే క్రమంలో బయోటెక్‌ కంపెనీ జీఎంగా పనిచేసే శివనేసన్‌, యజమాని డాక్టర్‌ రాజ్‌కుమార్‌లు కోవిడ్‌-19 చికిత్సకు ఉపయోగించేందుకు తాము కనుగొన్న దగ్గు మందు కాంబినేషన్‌ ఫార్ములాను సేవించారు.

ఈ ద్రావకాన్ని తాగిన వెంటనే వారిద్దరూ శ్వాససంబంధిత సమస్యలతో బాధపడగా సమీప ఆస్పత్రికి తరలించారు. శివనేసన్‌ కాంబినేషన్‌ మందును అధిక డోస్‌ తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోగా, రాజ్‌కుమార్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం​ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి : ఎస్‌బీఐ ఉద్యోగికి కరోనా: ఆఫీసు మూసివేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement