
చండీగడ్ : మొబైల్ ఫోన్‌కు చార్జీంగ్ పెట్టి, హెడ్ సెట్లో పాటలు వింటున్న యువకుడు షాక్ కొట్టి చనిపోయాడు. ఈ సంఘటన బుధవారం హర్యానా రాష్ట్రంలోని యముననగర్ జిల్లా పాండ్యో గ్రామంలో చోటు చేసుకుంది. తాత్‌సింగ్ (22) అనే యువకుడు తన ఇంట్లో ఫోన్‌కు చార్జీంగ్ పెట్టి అలానే హెడ్‌ఫోన్ పెట్టుకుని పాటలు వింటున్నాడు. ఆ సమయంలో ఇంట్లో విద్యుత్ సరఫరా లేదు. కరెంటు వచ్చే సమయానికి చార్జీంగ్ కేబుల్ అలానే ఉండడంతో తాత్‌సింగ్ కరెంటు షాక్‌కు గురైయ్యాడు. దాంతో ఇంట్లో వాళ్లు అతడ్ని యముననగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు.
Comments
Please login to add a commentAdd a comment