దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అలాగే మరణాలు కూడా.. ఈ పాపం కేవలం వైరస్‌దేనా. నిజానికి కొంత మనది కూడా.. ఎందుకంటే.. మాస్కులు ధరించండి.. లేకుంటే జరిమానా విధిస్తామని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి.. ఓసారి రోడ్ల మీద చూడండి.. మాస్కు కరోనా వ్యాప్తిని నిరోధిస్తుందని తెలిసినా.. ఇప్పటికీ వాటిని వేసుకోని వాళ్లు కనిపిస్తునే ఉన్నారు.. వేసుకున్న వాళ్లలోనూ ముక్కును వదిలేసి మూతిని కప్పుకుంటే చాలన్నట్లు కొందరు.. మెడకు తగిలించుకుంటే చాలన్నట్లు మరికొందరు.. ఇలా వైరస్ వ్యాప్తికి తమవంతు సాయం చేస్తునే ఉన్నారు. మాస్కు సరిగా ధరించకపోవడం వల్ల వైరస్ వ్యాపిస్తుంది లేదా సోకుతుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా.. కొందరి చెవికెక్కడమే లేదు..అందుకే మాస్క్ ఎలా వేసుకోవాలి.. ఎలా వేసుకోకూడదు.. ఓసారి చూద్దామా..ఆచరించి వైరస్ వ్యాప్తిని నిరోధిద్దామా..
గెడ్డం కనిపించేలా ఉండొద్దు; గ్యాప్‌లు ఉండేలా లూజుగా వేసుకోవద్దు
ముక్కును వదిలేయొద్దు ; ముక్కు కొన మాత్రమే కవరయ్యేలా వేసుకోవద్దు..
Comments
Please login to add a commentAdd a comment