న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పండిట్ దీన్‌దయాళ్ భవన్‌లోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న 24 ఫైరింజన్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డుకు గాయలైనట్టుగా సమాచారం. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఈ క్లాంపెక్స్‌లో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్రాంచ్‌తోపాటు, అటవీ మంత్రిత్వ శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ కార్యాలయాలు ఈ సముదాయంలోనే ఉండటంతో ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో ఈ బిల్డింగ్‌ను పర్యావరణ భవన్‌గా పలిచేవారు.
Comments
Please login to add a commentAdd a comment