
ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం: 83 మంది మృతి
కొల్లం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 80 మందికిపైగా మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. 150 మందికి పైగా తీవ్రగాయాలయినట్టు సమాచారం. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది.
ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను కొల్లం, తిరువనంతపురం ఆస్పత్రులకు తరలించారు. కేరళ సీఎం ఉమెన్ చాందీ, మంత్రులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.