
మరింతగా క్షీణించిన మేధా పాట్కర్ ఆరోగ్యం
ధార్: సర్దార్ సరోవర్ డ్యాం ముంపు బాధితులకు సరైన పునరావాసం కల్పించాలని కోరుతూ గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమ కారిణి మేధా పాట్కర్(62) ఆరోగ్యం మరింతగా క్షీణించింది. వైద్య పరీక్షల్లో పాట్కర్ రక్తపోటు, షుగర్ స్థాయి పడిపోయినట్లు తేలిందని అదనపు కలెక్టర్ డి.కె.నాగేంద్ర తెలిపారు. మేధా పాట్కర్‌తో పాటు 11 మంది ఉద్యమకారులు జూలై 27 నుంచి మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా ఛిఖల్డా గ్రామంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.