ఆహార కల్తీపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆహార కల్తీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆహారాన్ని కల్తీ చేస్తే కఠిన శిక్షలు విధించే విధంగా చట్టాలు చేయాలని కూడా కోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది. పాల కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు మండిపడింది.
ఆహార భద్రతా చట్టాల సవరణ అంశం పరిశీలించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన చేసింది. ఆహారాన్ని కల్తీ చేస్తే జీవిత ఖైదు విధించేలా చట్టాన్ని మార్చాలని కోర్టు కోరింది. ఈ అంశంపై నాలుగు వారాలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
**