
సాక్షి, న్యూఢిల్లీ : ప్లాస్టిక్‌తో తయారు చేసిన జాతీయ జెండాను ఉపయోగించరాదని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టూ నేషనల్ ఆనర్ యాక్ట్ 1971, ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్లాస్టిక్ జెండాల బదులు పేపర్‌తో తయారు చేసిన జెండాలనే ఉపయోగించాలని సూచించారు.
పేపర్ జెండాలను కూడా కార్యక్రమం ముగిసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయరాదని ఆదేశించారు. జెండాను అవమానించే రీతిలో ప్రవర్తించరాదని, అది దేశ ప్రజల ఆశయాలకు, ఆశలకు ప్రతిరూపమని హోంశాఖ పేర్కొంది. కార్యక్రమం అనంతరం పేపర్ జెండాలను కూడా జాగ్రత్తగా, అవమానం కలగని రీతిలో ఉంచాలని సూచించారు.