ప్రధానిగా మోడీని స్వాగతించాల్సిందే: ఆళగిరి
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి బహిష్కృత డీఎంకే పార్టీ ఎంపీ ఎంకే అళగిరి ప్రశంసలతో ముంచెత్తారు. భారత ప్రధానిగా మోడీకి ఎక్కువ అవకాశాలున్నాయని అళగిరి అన్నారు. దేశమంతటా మోడీ హవా నడుస్తోందన్నారు. అంతేకాకుండా మోడీ పరిపాలనాధ్యక్షుడు అని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడీని స్వాగతించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
జనవరి మాసంలో అళగిరిని డీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో భేటి అవ్వడం రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే స్వంత పార్టీ పెడుతున్నారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. కొందరు మోసగాళ్ల చేతిలో డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి బందీ అయ్యారని ఆయన అన్నారు.