సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన మోదీ ముక్త్ భారత్ నినాదం సెగలు రేపుతోంది. ముంబయి శివాజీ పార్క్‌లో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముంబయి శివార్లలోని వసాయ్‌లో ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు గుజరాతీల దుకాణాలను టార్గెట్ చేసి సైన్‌బోర్డులను ధ్వంసం చేశారు.
ముంబయి-అహ్మదాబాద్ హైవేపై పలు గుజరాతీ దాబాలపై కూడా ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. మహారాష్ట్రలో గుజరాతీల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఎంఎన్‌ఎస్ చెలరేగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలోనూ దాదర్‌లోని ఓ జ్యూవెలరీ షాపుపై, ముంబయిలోని మహీంలో ఓ హోటల్‌పైనా హింసాత్మక దాడులకు తెగబడ్డారు. గుజరాతీలో ఉన్న సైన్‌బోర్డులను లాగిపడవేశారు. అప్పట్లో దాదార్‌లోని పీఎన్ గాడ్గిల్ జ్యూవెలర్స్ ఎదుట ఆందోళనకు దిగిన ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు మేనేజ్‌మెంట్ దిగివచ్చి సైన్‌బోర్డును తొలగించడంతో శాంతించారు. నగరంలోని మహీం వద్ద గుజరాతీలో ఉన్న హోటల్ శోభ సైన్‌బోర్డును కూడా ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు బలవంతంగా తొలగింపచేశారు.
Comments
Please login to add a commentAdd a comment