మోదీ-అబే గంగా హారతి! | Modi-Abe Ganga harati! | Sakshi
Sakshi News home page

మోదీ-అబే గంగా హారతి!

Published Sun, Dec 13 2015 1:52 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

మోదీ-అబే గంగా హారతి! - Sakshi

మోదీ-అబే గంగా హారతి!

45 నిమిషాలసేపు ఘాట్‌లోనే...
 
♦ సరికొత్త సాంస్కృతిక బంధానికి నాంది
♦ వేదికపై ఇద్దరు ప్రధానుల సెల్ఫీ
 
 వారణాసి: ఢిల్లీలో శనివారమంతా చర్చలు, ఒప్పందాల్లో బిజీగా ఉన్న భారత్, జపాన్ ప్రధానులు మోదీ, షింజో అబే.. సంధ్యాసమయంలో వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో.. గంగా హారతిలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య సరికొత్త సాంస్కృతిక బంధానికి నాందిగా కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరూ గంగకు హారతి ఇవ్వటంతో పాటు తర్వాత జరిగిన కార్యక్రమాలను 45 నిమిషాల సేపు వీక్షించారు. వేదికపై అబే.. మోదీతో సెల్ఫీ తీసుకున్నారు. కాగా, ఇద్దరు ప్రధానుల ఈ పర్యటన కోసం దాదాపు 7వేల మంది పోలీసులు, సిబ్బంది పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

మంగళవారం నుంచే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ), ఎన్‌ఎస్‌జీ, యాంటీ-టైస్టు స్క్వాడ్ బలగాలు వారణాసిని జల్లెడపట్టాయి. బాబత్‌పూర్ ఎయిర్‌పోర్టునుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు 22 కిలోమీటర్ల దూరం.. ఇద్దరు ప్రధానులకు స్వాగతం పలుకుతూ.. పోస్టర్లు కట్టారు. కొందరు జపాన్ భాషలో అబేకు వెల్‌కమ్ చెప్పారు. గతేడాది మోదీ జపాన్ పర్యటనలో క్యోటో-వారణాసి భాగస్వామ్యంపై (ఈ రెండు ప్రాంతాలు ఇరు దేశాల సంస్కృతికి ప్రతిబింబమని) ఇరుదేశాల ప్రధానులు చర్చించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement