ప్రధాని మోదీ జాతీయ పతాకావిష్కరణ | Modi greets nation on Independence Day | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ జాతీయ పతాకావిష్కరణ

Published Sat, Aug 15 2015 7:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

ప్రధాని మోదీ జాతీయ పతాకావిష్కరణ

ప్రధాని మోదీ జాతీయ పతాకావిష్కరణ

న్యూఢిల్లీ: అరవై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా  దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో శనివారం ఉదయం నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు.

 

* దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ ఉద్యమం ఊపందుకుంది
* ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు
* మీ ఇంట్లోని 10 - 15 ఏళ్ల పిల్లలే స్వచ్ఛభారత్ అంబాసిడర్లు
* గాంధీజీ 150వ జన్మదినం నాటికి స్వచ్ఛభారతాన్ని ఆ మహానీయుడికి అంకితం ఇవ్వాలి
* కొత్త కలలు సాధించేందుకు టీమిండియా
* మన లక్ష్యం టీమిండియా
* దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకం
* దేశంలో పేదరికాన్ని తరిమికొట్టాలి
* అభివృద్ధి తొలిమెట్టు బ్యాంకు ఖాతాలు
* 50 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు తెరిచాం
* కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతోనే దేశం పురోగతి
* భిన్నత్వంలో ఏకత్వం అన్న భావన ప్రపంచానికే దిక్సూచి
* మత మౌఢ్యానికి చోటు ఉండరాదు
* దేశ భద్రతకు కూడా స్కిల్ ఇండియా తోడ్పడుతుంది
* కులతత్వం, మతతత్వం దేశాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలు
* దేశం ఐక్యతకు భంగం వాటిల్లితే కలలు కల్లలు
* బలిదానాలు, త్యాగాలు చేసిన అమరులకు నివాళులు
* 125 కోట్ల మందికి నూతన సూర్యోదయం
* భారత కీర్తిని యువత నలుదిశలా చాటాలి
*అవినీతి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం
* దేశాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
*స్వచ్ఛ భారత్ కు పిల్లలే అంబాసిడర్లు

 

*పేదలను దేశంలో కీలక భాగస్వామ్యులు చేయాలి
*మన ప్రణాళిలకలు, ఆలోచలను దేశానికి కొత్త బాటలు వేయాలి
*బ్యాంకు ఖాతాలు తెరవాలని పిలుపునిస్తే పేదలంతా ముందుకొచ్చారు
*బీమా అంటే తెలియని అట్టడుగు వర్గాలకు బీమా అంటే ఏమిటో తెలిసింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement