మోదీ బలహీన ప్రధానిగా మారారు: రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో హెచ్1బీ వీసాలపై చర్చించకపోవడంపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత్‌కు ప్రస్తుతం బలహీనమైన ప్రధాని నేతృత్వం వహిస్తున్నారని ట్వీటర్‌లో విమర్శించారు. మరోవైపు ప్రధాని పర్యటనలు కేవలం ఫొటోలకే పరిమితమయ్యాయని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.