న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వీలైనన్ని ఎక్కువ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. జూలై 19న భారత వైద్యమండలి (సవరణ) బిల్లు-2016, దంతవైద్యుల (సవరణ) బిల్లు-2016లను లోక్‌సభ ఆమోదించింది. ఈ ఉత్సాహంతో, ఇప్పటికే నిర్ణయించిన 16 బిల్లులతోపాటు మరో నాలుగు కొత్త బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. అయితే ఏ నాలుగు బిల్లులను ఈ సమావేశాల్లో కొత్తగా తీసుకొస్తారో ఆయన స్పష్టం చేయలేదు.
దేశ శ్రేయస్సు దృష్ట్యా వస్తు, సేవల పన్ను బిల్లుకు తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు అనంత్ వివరించారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలన్నీ ఈ బిల్లుకు సానుకూలంగా ఉన్నాయనీ, ఏకాభిప్రాయాన్ని సాధించగలమనే విశ్వాసంతో ఉన్నామని అనంత్ తెలిపారు.
ఈ సమావేశాల్లోనే మరో నాలుగు బిల్లులు!
Published Fri, Jul 22 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
Advertisement
Advertisement