
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పలుచోట్ల ప్రజలు ఉల్లంఘిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 3219 మందిని నెలరోజులుగా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. రోజుకు సగటున 107 మంది లాక్‌డౌన్ ఉల్లంఘనులను అరెస్ట్ చేసినట్టు పోలీసు గణాంకాలు వెల్లడించాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకూ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 3681 మందిపై కేసులు నమోదయ్యాయని, వీటిలో 944 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని గణాంకాలు వెల్లడించాయి. కాగా దేశరాజధానికి సమీపంలోని నోయిడా, గ్రేటర్ నోయిడాల్లోనూ కరోనా మహమ్మారి కేసులు అధికంగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment